చినూర్ గ్రామంలో తాళం వేసిన ఇంట్లో చోరీ
నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): చినూరు గ్రామంలో తాళం వేసిన ఇంట్లో చోరీ బంగారు ఆభరణాలు(Gold jewelry) మాయమైనట్లు ఎస్సై భార్గవ్ గౌడ్(SS Bhargav Goud) తెలిపారు. ఎస్సై భార్గవ్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని చినూరు గ్రామానికి చెందిన కొండ ప్రమీల(45) కొండ ప్రమీల తన తల్లితో కలిసి నివసిస్తుంది.మంగళవారం కొండ ప్రమీల బంధువుల వద్దకు మెదక్‌కు వెళ్ళింది.
గురువారం మధ్యాహ్నం ఇంటికి వచ్చి చూడగా ఇంటికి వేసిన తాళం పగల కొట్టి ఉంది.బీరువాను పరిశీలించగా ఐదు గ్రాముల బంగారు ఉంగరం, మూడు గ్రాముల చెవి రింగులు, 13 గ్రాముల బంగారు గుండ్లు కనిపించడం లేదు.అయితే 10 గ్రాముల గుండ్లు,20 తులాల వెండి గొలుసులు యధావిదంగా ఉన్నాయి.
ఇంటి ప్రధాన ద్వారం ద్వారా వద్ద మరియు ఇంటి లోపల కారంపోడి చల్లి ఉంది.బాధితురాలు స్థానిక పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇవ్వడంతో ఎస్ఐ. భార్గవ్ గౌడ్ సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు.జరిగిన సంఘటనలో ఫింగర్ ప్రింట్స్ యూనిట్‌ను పిలిపించగా ఒక ఛాన్స్ ప్రింట్ సేకరించినట్లు తెలిపారు.సీసీ కెమెరాలు కూడా ఉండడంతో వాటి ఫుటేజీని కూడా పరిశీలిస్తున్నట్లు ఎస్సై భార్గవ్ గౌడ్ తెలిపారు.