కేటీఆర్‌ను కలిసిన మాజీ జడ్పీటీసీ

19-11-2026 | 11:47pm

సత్తుపల్లి నియోజకవర్గంలో ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది

బిఆర్ఎస్‌ పార్టీ కి పూర్వవైభవం తెచ్చేందుకు సండ్ర వెంకటవీరయ్య కృష

సత్తుపల్లి,(విజయక్రాంతి): బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌(KCR)ను కల్లూరు మాజీ జడ్పీటీసీ కట్టా అజయ్ కుమార్(Former ZPTC Katta Ajay Kumar) గురువారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సత్తుపల్లి నియోజకవర్గంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతం, ప్రజా సమస్యలు తదితర అంశాలపై కేటీఆర్‌తో చర్చించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కట్టా అజయ్ కుమార్ మాట్లాడుతూ.. సత్తుపల్లి నియోజకవర్గంలో ప్రస్తుత ప్రభుత్వ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో నియోజకవర్గంలో గులాబీ జెండా మళ్లీ రెపరెపలాడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

బిఆర్ఎస్ పార్టీకి పూర్వవైభవం తీసుకురావడానికి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య(Former MLA Sandra Venkata Veeraiah) తీవ్రంగా శ్రమిస్తున్నారని తెలిపారు. సండ్ర వెంకటవీరయ్యకు ప్రజల్లో మంచి గుర్తింపు ఉందని, గతంలో ఆయన ప్రజలకు అందించిన సేవలను ప్రజలు ఇప్పటికీ మరచిపోలేదని అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో గతంలో సబ్బండ వర్గాలు సంతోషంగా ఉన్నాయని, ప్రస్తుత పరిస్థితుల్లో వివిధ వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ వారి సమస్యలకు తగిన పరిష్కారం లభించడం లేదని విమర్శించారు. 

కేసీఆర్ పాలనలో అమలైన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ఈ సందర్భంగా గుర్తుచేశారు. పార్టీ శ్రేణులంతా ఐక్యంగా పనిచేస్తూ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కట్టా అజయ్ కుమార్‌తో మాట్లాడిన కేటీఆర్ ఆయన భుజం తట్టి ప్రోత్సహించినట్లు తెలిపారు. ఈ భేటీతో సత్తుపల్లి నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ రాజకీయ పరిణామాలపై పార్టీ శ్రేణుల్లో చర్చ మొదలైంది. ఈ కార్యక్రమంలో యర్రబోయినపల్లి గ్రామ బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు పుసులూరి శ్రీనివాసరావు బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు