పెరిక సంఘం సమావేశం
కన్నాయిగూడెం,(విజయక్రాంతి): కన్నాయిగూడెం మండలం(Kannaigudem Mandal)లో పెరిక కుల సంఘం బలోపేతానికి ములుగు జిల్లా నుండి వచ్చిన (పురగిరి క్షత్రియ)పెరిక సంఘం(Perika Community) నాయకులు ముప్పనపల్లి గ్రామం రామాలయంలో గురువారం సమావేశం నిర్వహించారు. ముందుగా ఉమ్మడి వరంగల్ జిల్లా పెరిక సంఘం మాజీ అధ్యక్షులు అచ్చ విద్యాసాగర్ స్వర్గస్తులైనందుకు రెండు నిమిషాలు మౌనం పాటించారు. తదనంతరం జిల్లా సభ్యులు మాట్లాడుతూ పెరిక సంఘం బలోపేతం చేయడానికి అతి త్వరలో మండల కమిటీ నియమించడం జరుగుతుందని,దీనికి మండలంలోని పెరిక కులస్తులు సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షులు గందె జగన్నాథం, ప్రధాన కార్యదర్శి దిడ్డిరాజ్ కుమార్ ఉపాధ్యక్షులు కొమిరి శెట్టి వెంకన్న గోవిందరావుపేట మండల ప్రధాన కార్యదర్శి కంటెం సత్యనారాయణ ఎగ్గిడి రవి మండల ,పల్లా బుచ్చయ్య, ఆకుల సత్యనారాయణ,గడ్డం శ్రీను, వనపర్తి రామయ్య,చింతకుట్ల వెంకటయ్య, చీదరి సుమన్, చిట్టెం శ్రీనివాస్,పాపక శ్రీను, అబ్బు వెంకటయ్య, గడ్డం విష్ణు, బుద్దే సత్యనారాయణ, వెంకట్ నర్సయ్యపాల్గొన్నారు.