రాష్ట్రస్థాయి నెట్ బాల్ పోటీలలో నిలిచిన సోనాల విద్యార్థిని

29-11-2026 | 07:44pm

బోథ్ నవంబర్ 29 (విజయక్రాంతి): సోనాల మండల కేంద్రానికి చెందిన ఉన్నత పాఠశాల విద్యార్థిని ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్17 బాలికల నెట్ బాల్(Netball) పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయిలో మూడవ స్థానం సంపాదించింది. విద్యార్థిని వర్షిత రాష్ట్రస్థాయిలో మూడో స్థానంలో నిలవడంతో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజేంద్రప్రసాద్ ఫిజికల్ డైరెక్టర్ శైలజ, ఉపాధ్యాయులు అభినందించారు. భవిష్యత్తులో మరింతగా నెట్ వాల్ పోటీలలో రాణించాలని ఆకాంక్షించారు.

మరిన్ని వార్తలు