అనారోగ్యంతో మృతిచెందిన కార్యకర్త కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం
29-11-2026 | 08:14pm
బోధన్, నవంబర్ 29 (విజయక్రాంతి): దీక్షా దివస్ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఎడపల్లి మండల కేంద్రంలోని సారాయి ఫంక్షన్ హాల్‌లో ఆదివారం బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్(Ex MLA Shakeel Ahmed) బోర్గం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త పార్దే రాజు కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. ఇటీవల అనారోగ్యంతో పార్దే రాజు మృతి చెందడంతో ఆయన కుటుంబానికి అండగా నిలిచేందుకు మాజీ ఎమ్మెల్యే షకీల్ రూ.10 లక్షల చెక్కును కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా రెంజల్ మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు షకీల్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.