ప్రమాద బాధిత చిన్నారులకు కోరం ఉమా–సురేందర్ ఆర్థిక సాయం

15-11-2026 | 06:42pm

- గాంధీ, కేబీకే ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న చిన్నారులకు పరామర్శ

- వైద్య ఖర్చుల కోసం రూ.30 వేల ఆర్థిక సహాయం

టేకులపల్లి, (విజయక్రాంతి): టేకులపల్లి మండలం బేతంపూడి స్టేజి వద్ద ఇటీవల జరిగిన టపాసుల ప్రమాదంలో తీవ్రంగా గాయపడి హైదరాబాద్‌లోని గాంధీ, కేబీకే ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న చిన్నారులను కాంగ్రెస్ నాయకులు కోరం ఉమా–సురేందర్(Congress leaders Korum Uma Surender) పరామర్శించారు. వైద్యులను అడిగి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని, బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పారు.

వైద్య ఖర్చుల నిమిత్తం రమేష్ కుమారుడికి రూ.10 వేలు, నరేష్ కుమారుడికి రూ.20 వేలు కలిపి మొత్తం రూ.30 వేల ఆర్థిక సాయం అందించారు. చిన్నారులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆపదలో ఉన్న కుటుంబాలకు అండగా నిలిచి మానవత్వాన్ని చాటుకున్నారు.

మరిన్ని వార్తలు