కుంచెతో అద్భుతాలు సృష్టించిన చిన్నారులు
కొత్తపల్లి, నవంబర్ 15 (విజయక్రాంతి): చిన్నారుల్లో దాగి ఉన్న సృజనాత్మక ప్రతిభను వెలికితీసేందుకు పారమిత వరల్డ్ స్కూల్ ఆధ్వర్యంలో తిమ్మాపూర్లోని ఉపగ్న హోమ్స్ వేదికగా చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న సుమారు 50 మంది చిన్నారులు పాల్గొని తమ చిత్రలేఖన ప్రతిభను చాటుకున్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక సర్పంచ్ గుజ్జుల శ్వేత హాజరై చిన్నారులు వేసిన చిత్రాలను పరిశీలించి అభినందించారు. అనంతరం సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన విజేతలకు బహుమతులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ పొలం మల్లేష్, ఉపగ్న హోమ్స్ అధ్యక్షుడు సీహెచ్ రవీందర్ రెడ్డి, ఉపాధ్యక్షుడు సాగర్, ప్రధాన కార్యదర్శి సుధాకర్, పాఠశాల డైరెక్టర్లు ప్రసూన, వి.యు.ఎం. ప్రసాద్, ప్రధానాచార్యులు శ్రీకర్, విద్యా సమన్వయకర్త దీప్తిరాణి, ఉపాధ్యాయులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.