అల్లం నారాయణ కుటుంబానికి జర్నలిస్టు సంఘం అండ
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): సీనియర్ జర్నలిస్ట్, తెలంగాణ ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్, టీయూడబ్ల్యూజే (టీజేఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు, ఉద్యమ నాయకుడు అల్లం నారాయణ మాతృమూర్తి అల్లం బుచ్చమ్మ ఇటీవల మృతి చెందడం పట్ల టీయూడబ్ల్యూజే (టీజేఎఫ్) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా గాజులపల్లి గ్రామంలోని అల్లం నారాయణ స్వగృహానికి వెళ్లిన యూనియన్ జిల్లా అధ్యక్షుడు కల్లోజి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి మహమ్మద్ షఫీతో పాటు రాష్ట్ర, జిల్లా బాధ్యులు ఆయనను పరామర్శించారు. బుచ్చమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అల్లం నారాయణ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
మాతృమూర్తిని కోల్పోవడం తీరని లోటని, ఈ బాధను తట్టుకునే మనోధైర్యాన్ని కుటుంబ సభ్యులకు భగవంతుడు ప్రసాదించాలని ఆకాంక్షించారు. జర్నలిస్టు ఉద్యమంలో విశేష సేవలందిస్తూ పాత్రికేయుల హక్కుల కోసం నిరంతరం పోరాడుతున్న అల్లం నారాయణకు ఈ కష్ట సమయంలో అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ఈ పరామర్శ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర నాయకులు కృష్ణ గోవింద్, జిల్లా ఉపాధ్యక్షుడు కాగితపు వెంకటేశ్వర్లు, టెంజూ జిల్లా అధ్యక్షుడు వట్టికొండ రవి, పాపారావు, కృష్ణంరాజు, తోట రామకృష్ణ, సీమకుర్తి రామకృష్ణ, జెల్ది శామ్ తదితరులు పాల్గొన్నారు.