ప్రముఖ కళాకారుడు నర్ర బుచ్చయ్య కన్నుమూత

15-11-2026 | 06:50pm

గంభీరావుపేట, నవంబర్ 15 (విజయక్రాంతి): ప్రముఖ కళాకారుడు నర్ర బుచ్చయ్య యాదవ్(80)(Artist Narra Buchaiah Yadav) ఆదివారం మధ్యాహ్నం వృద్ధాప్య సమస్యలు, అనారోగ్యంతో కన్నుమూశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన ఆయన తన ఆటపాటలు, కథలతో కళారంగానికి ఎన్నో ఏళ్లపాటు విశేష సేవలందించారు. ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలతో పాటు హైదరాబాద్ ప్రాంతంలోనూ కళాకారుడిగా నర్ర బుచ్చయ్య సుపరిచితులు.

తన కళాప్రదర్శనలతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం స్వగ్రామంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపట్ల సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు బాలరాజ్ గౌడ్‌, ఉపసర్పంచ్ బినేమెని ప్రియాంక -శ్రవణ్ యాదవ్, యాదవ సంఘం మండల అధ్యక్షుడు దోమకొండ కృష్ణకాంత్ యాదవ్, ప్రధాన కార్యదర్శి బొంగు మల్లేశం యాదవ్ తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు సంతాపం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు