వనభోజనాలు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక
కొలన్ హన్మంత్ రెడ్డి
కుత్బుల్లాపూర్, నవంబర్ 15(విజయక్రాంతి): కార్తీక మాసంలో వనభోజనాలు నిర్వహించడం భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు(Indian culture and traditions) ప్రతీక అని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ(Quthbullapur constituency) కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం(Quthbullapur constituency) పరిధిలోని కౌసల్య కాలనీలో రెడ్డి సంఘం(Reddy Association) ఆధ్వర్యంలో నిర్వహించిన రెడ్డి కార్తీక మాస వనభోజనాల కార్యక్రమానికి సంఘం సభ్యుల ఆహ్వానం మేరకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు, సంఘం సభ్యులు హన్మంత్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా హన్మంత్ రెడ్డి మాట్లాడుతూ ఇలాంటి ఆత్మీయ కార్యక్రమాలు సమాజంలోని ప్రజలందరినీ ఒకచోట చేర్చి, పరస్పర ఐక్యత, సోదరభావం, ఆత్మీయతను పెంపొందిస్తాయని తెలిపారు.
కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి ఉండాలని, మన సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నిజాంపేట్ సర్కిల్ అధ్యక్షులు కొలన్ రాజశేఖర్ రెడ్డి, డిసిసి జనరల్ సెక్రెటరీ రాజి రెడ్డి, డివిజన్ అధ్యక్షులు కొలన్ జీవన్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు సత్తి రెడ్డి, రెడ్డి సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.