ప్రవీణ్ కుమార్‌కు టీఆర్ఎస్ నేతల స్ట్రాంగ్ కౌంటర్

15-11-2026 | 07:13pm

ఆసిఫాబాద్, నవంబర్ 15 (విజయక్రాంతి): తెలంగాణ రక్షణసేన(Telangana Rakshana Sena) అధినేత కవితపై(Kavitha) బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కిరిమిళ్ల వినోద్ చారి, సిర్పూర్ నియోజకవర్గ ఇన్‌చార్జి సబిత పేర్కొన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ వ్యక్తిగత విమర్శలు మానుకోవాలని హితవు పలికారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న తమ పార్టీపై అనవసర వ్యాఖ్యలు సహించబోమన్నారు. అంతకుముందు బిర్సా ముండా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మనోహర్, కిషన్‌రావు, పెందూరు దర్శు, తిరుపతి, వినోద్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు