పేదింటి ఆడపిల్లకు అండగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్
నిజాంసాగర్ నవంబర్ 15( విజయక్రాంతి ): పేదింటి ఆడబిడ్డకు కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ పథకాలు(Kalyana Lakshmi and Shaadi Mubarak schemes) లాంటివని జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతరావు(Jukkal MLA Thota Lakshmikanta Rao) పేర్కొన్నారు. ఆయన ఆదివారం నాడు నిజాంసాగర్, మహమ్మద్ నగర్ మండలంలోని కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్, లబ్ధిదారులకు, చెక్కులను అందించారు. నూతన ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు(Aasara pension beneficiaries) ప్రొసీడింగ్ కాపీలను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం పేదల పక్షపాతిగా పనిచేస్తుందని. ఎల్లవేళలా పేదలకు అండగా నిలిచే ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అని పేర్కొన్నారు.
జుక్కల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం తన శాసశక్తుల కృషి చేస్తున్నానని, ఎవరికి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా జుక్కల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి బాటలో ముందుకు తీసుకెళ్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు మల్లికార్జున్, అచ్చంపేట సహకార సంఘ అధ్యక్షులు పట్లోళ్ల జనార్దన్ రెడ్డి, మహమ్మద్ నగర్ మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి, నిజాంసాగర్ మండల పార్టీ అధ్యక్షులు ప్రజాపండరి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు సంకు లక్ష్మయ్య, గంగి రమేష్, అన్ని గ్రామాల సర్పంచులు ముఖ్య నాయకులు లబ్ధిదారులు పాల్గొన్నారు.