కుల వివక్షపై అంబేద్కర్ వాదుల సమరశంఖం
జగిత్యాల, నవంబర్ 15 ( విజయక్రాంతి ) : భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్(Dr. Babasaheb Ambedkar) ఆశయాలు, రాజ్యాంగ విలువలను ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో జగిత్యాల జిల్లా(Jagtial District) కేంద్రంలో ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న అంబేద్కర్ స్మరణ కార్యక్రమం డిక్కీ జిల్లా కో ఆర్డినేటర్ నల్ల శ్యామ్ ఆధ్వర్యంలో, నక్క జమలాకర్ గొల్లపల్లి మండల ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఉపాధ్యక్షులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ప్రభుత్వ భారత్ ఇంటర్నేషనల్, డిక్కీ జిల్లా కో - ఆర్డినేటర్ నల్ల శ్యామ్ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం ఉదయం 9.30 గంటలకు అంబేద్కర్‌కు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆదివారం గొల్లపల్లి మండల ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఉపాధ్యక్షులు నక్క జమలాకర్ ముఖ్య అతిథిగా పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా నక్క జమలాకర్ మాట్లాడుతూ అణగారిన వర్గాల అభ్యున్నతికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. విద్య, రాజ్యాంగం, ఓటు హక్కు ద్వారా ప్రతి పౌరుడికి సమానత్వం, ఆత్మగౌరవం, సామాజిక న్యాయం కల్పించేందుకు ఆయన చేసిన కృషి భావితరాలకు స్ఫూర్తిదాయకమన్నారు. అంబేద్కర్ ఆశయాలు, రాజ్యాంగ స్ఫూర్తిని ప్రతి గ్రామం, మండల కేంద్రానికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్తారి ప్రభాకర్, కంటే అంజయ్య, ముద్దమల్ల ప్రవీణ్ కుమార్, గిద్దె శంకరయ్య, దోమల గంగాధర్, కాయితి శ్రీనివాస్, బొల్లం ప్రభాకర్ తదితర అంబేద్కర్ వాదులు పాల్గొన్నారు.