మందకృష్ణ మాదిగను కలిసిన మంత్రి, ఎమ్మెల్యే
15-11-2026 | 06:55pm
జగిత్యాల, నవంబర్ 15 (విజయక్రాంతి): జగిత్యాల జిల్లా కేంద్రానికి విచ్చేసిన ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువా కప్పి ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు గాజంగి నందయ్య తదితరులు పాల్గొన్నారు.