అనుమతి లేకుండా బోర్లు వేస్తే కఠిన చర్యలు

15-11-2026 | 07:10pm

వాల్టా చట్టం నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి

రైతులకు తహసిల్దార్ వరలక్ష్మి సూచన

కోనరావుపేట నవంబర్ 15 (విజయక్రాంతి): కోనరావుపేట మండల(Konaraopeta Mandal) పరిధిలో రైతులు(Farmers), ప్రజలు ముందస్తు అనుమతి లేకుండా బోర్‌వెల్‌లు, బోర్‌హోల్‌లు తవ్వకూడదని తహసిల్దార్ వరలక్ష్మి(Tahsildar Varalakshmi) సూచించారు.గత నెల 27-10-2026న జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం దృష్ట్యా భూగర్భ జలాల పరిరక్షణకు(Conservation of Groundwater) కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. వాల్టా చట్టం(WALTA Act)–2002 నిబంధనలకు అనుగుణంగా బోర్‌వెల్‌లు, బోర్‌హోల్‌ల తవ్వకాలపై కఠిన నియంత్రణ విధించాలని భూగర్భ జల వనరుల శాఖ అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

ఈ నేపథ్యంలో కోనరావుపేట మండల పరిధిలో బోర్లు వేయాలనుకునే రైతులు, ప్రజలు తప్పనిసరిగా ముందస్తు అనుమతి పొందాలని తహసిల్దార్ స్పష్టం చేశారు. అనుమతి లేకుండా బోర్‌వెల్‌లు లేదా బోర్‌హోల్‌లు తవ్వితే వాల్టా చట్టం–2002 ప్రకారం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.కావున మండలంలోని రైతులు, ప్రజలు ఈ నిబంధనలను తప్పనిసరిగా పాటించి భూగర్భ జలాల పరిరక్షణకు సహకరించాలని తహసిల్దార్ వరలక్ష్మి కోరారు.

మరిన్ని వార్తలు