చర్లలో ఘనంగా మంత్రి తుమ్మల జన్మదిన వేడుకలు

15-11-2026 | 06:49pm

చర్ల, నవంబర్ 15 (విజయక్రాంతి): తెలంగాణ వ్యవసాయ, చేనేత, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Telangana Minister Tummala Nageswara Rao) జన్మదిన వేడుకలు చర్లలో ఘనంగా జరిగాయి. మేజర్ పంచాయతీ కార్యాలయం ఎదురుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సీనియర్ నాయకులు, ప్రముఖ రైతు బండారు రామకృష్ణ చేతుల మీదుగా కేక్ కట్ చేసి వేడుకలు  నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఇర్ప శ్రీనివాసరావు మాట్లాడుతూ..."రాష్ట్రంలో తుమ్మల ఎంతో అభివృద్ధి చేశారని, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎన్నో ప్రాజెక్టులు నిర్మించిన ఘనత తుమ్మల గారికే దక్కుతుంది." అన్నారు.

గత 25 ఏళ్లుగా తుమ్మల చేసిన అభివృద్ధి పనుల గురించి సీనియర్ నాయకులు ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో చర్ల పిఎసిఎస్ చైర్మన్ పరుచూరి రవికుమార్, మాజీ మండల అధ్యక్షుడు ఆవుల విజయభాస్కర్ రెడ్డి, మేడిచర్ల కుమార్, అలవాల మహేష్ నాయుడు (బాలు), సుందరి సురేష్, తోట మల్ల వరప్రసాద్, చర్ల సొసైటీ డైరెక్టర్ సుందరి పెద్దిరాజు, లింగాపురం ఉపసర్పంచ్ తడికల నరేష్, కాకర్ల కుమార్, ఎస్సీ సెల్ నాయకుడు చల్లా పవన్, కణితి శ్రీనివాసరావు, మచ్చ ప్రసాద్,విస్సంపల్లి నాగేశ్వరరావు, మోడెం ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు