ఇసుక దందాకు అడ్డుకట్టేదీ?
అశ్వాపురం, నవంబర్ 15 (విజయక్రాంతి): మండలంలోని చింతిర్యాల ప్రాంతంలో(Chintiryala area) ప్రతిరోజూ 15 ట్రాక్టర్లు, ఒక జేసీబీతో రాత్రివేళల్లో ఇసుక అక్రమ రవాణా(Illegal sand transportation) జరుగుతోందని ఆదివాసీ జేఏసీ మండల అధ్యక్షుడు కల్లూరి నరసింహారావు(Adivasi JAC President Kalluri Narasimha Rao) ఆరోపించారు. ఒక్కో ట్రాక్టర్ ఇసుకను రూ.3 వేల నుంచి రూ.4 వేల వరకు విక్రయిస్తూ ప్రభుత్వ, గ్రామ పంచాయతీ ఆదాయానికి గండి కొడుతున్నారని విమర్శించారు.
ఇసుక రవాణాపై సమగ్ర విచారణ చేపట్టి పంచాయతీకి రావాల్సిన ఆదాయ వివరాలను వెల్లడించాలని, అనుమతులు లేని ట్రాక్టర్లను సీజ్ చేసి అక్రమ రవాణాను అరికట్టాలని పోలీస్, రెవెన్యూ అధికారులను డిమాండ్ చేశారు. అక్రమాలకు పాల్పడే వారిపై రాజకీయాలకు అతీతంగా చర్యలు తీసుకోవాలని కోరారు.