పేద మహిళలకు కుట్టు మిషన్లు, తోపుడు బండ్లు పంపిణీ

29-11-2026 | 06:50pm

బూర్గంపాడు,(విజయక్రాంతి): పేద మహిళలకు స్వయం ఉపాధి(Self-employment) కల్పించి ఆర్థికంగా నిలదొక్కుకునేలా ప్రోత్సహించేందుకు ఐటీసీ అనుబంధ సంస్థ(ITC subsidiary) రోటరీ క్లబ్ ఆఫ్ భద్రా సారపాక(Rotary Club of Bhadra Sarapaka) ముందుకొచ్చింది. ఇందులో భాగంగా 10 కుట్టు మిషన్లు, 4 తోపుడు బండ్లను విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాలకు చెందిన అర్హులైన మహిళలను ఎంపిక చేసి కుట్టు మిషన్లు పంపిణీ(Distribution of sewing machines) చేశారు. వీటి ద్వారా మహిళలు ఇంటి వద్దనే ఉపాధి పొందుతూ కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు.

అలాగే అవసరమైన సంస్థలకు ఆఫీసు బల్లలను అందించారు.ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షుడు ఆర్‌.పి. సింగ్‌, కార్యదర్శి డేవిడ్ అలివర్, రెడ్డిపాలెం సర్పంచ్ బానోత్ సరోజ,ఇతర రోటరీ ప్రతినిధులు, ఎస్‌బీయూ, హెచ్‌ఆర్‌ విభాగాల ప్రతినిధులు పాల్గొన్నారు. మహిళలు అందించిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధి దిశగా ముందుకు సాగాలని వారు సూచించారు.

మరిన్ని వార్తలు