ఒక్క ఫోన్ సందేశం.. విద్యార్థికి వైద్య భరోసా!
ఖమ్మంలో అత్యవసర ఆపరేషన్‌కు చొరవ చూపిన డాక్టర్ మట్టా దయానంద్
కల్లూరు, నవంబర్ 17 (విజయక్రాంతి): కల్లూరులోని తెలంగాణ గ్రామర్ స్కూల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థి అపెండిక్స్ సమస్యతో తీవ్ర కడుపునొప్పితో బాధపడుతున్నాడు. విషయం తెలుసుకున్న విద్యార్థి తండ్రి, జర్నలిస్ట్ చెవుల నరేష్ వాట్సాప్ ద్వారా రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్‌కుమార్(Congress leader Dr Matta Dayanand Vijaykumar)కు సమాచారం అందించారు.
వెంటనే స్పందించిన ఆయన ఖమ్మంలోని ఆసుపత్రిలో అత్యవసర శస్త్రచికిత్స జరిగేందుకు చొరవ చూపారు. దీంతో విద్యార్థికి సకాలంలో వైద్యం అందింది. ఆపద సమయంలో సహకరించిన డాక్టర్ మట్టా దయానంద్ విజయ్‌కుమార్, ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్‌కు విద్యార్థి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.