ఆసరా పింఛన్లు నిరుపేదలకు సామాజిక భరోసా

17-11-2026 | 05:10pm

అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే.

ములకలపల్లి,నవంబర్ 17 (విజయక్రాంతి): నిరుపేదలకు ఆసరా పింఛన్లు(Aasara Pensions) ఆర్థిక,సామాజిక భరోసాను కల్పిస్తాయని అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ(MLA Jare Adinarayana) అన్నారు. మంగళవారం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో(Zilla Parishad High School) చేయూత పథకం కింద మంజూరైన పింఛన్ల హక్కు పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు.516 మంది లబ్ధిదారులకు పెన్షన్ మంజూరు హక్కు పత్రాలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వితంతువులు, ఒంటరి మహిళలు,దివ్యాంగులు పెన్షన్ల కోసం గత ప్రభుత్వ హయంలో సంవత్సరాల తరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగారని,ఎన్నిసార్లు దరఖాస్తులు చేసుకున్నా వారి సమస్యలను పట్టించుకోలేదని ఆరోపించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పేదల కష్టాలను గుర్తించి,అర్హులైన వారికి పెన్షన్లు మంజూరు చేసిందన్నారు.

ప్రజలకు సేవ చేయడమే తన ప్రధాన బాధ్యత అని,అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా నిరంతరం కృషి చేస్తానని పేర్కొన్నారు.వితంతువులు, ఒంటరి మహిళలు,దివ్యాంగులు, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు.అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా కృషి చేస్తానని,ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు జహీర్, జిల్లా మహిళా అధ్యక్షురాలు పోదిలి జ్యోతి,జిల్లా నాయకులు తుమ్మ రాంబాబు,సర్పంచులు,ఉప సర్పంచులు,కాంగ్రెస్ నాయకులు,ఎన్ ఎస్ యు ఐ నాయకులు, కార్యకర్తలు, ఎంపీడీవో సత్యనారాయణ, పంచాయతీ కార్యదర్శులు,లబ్ధిదారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు