రైతుల రుణాల పునర్నిర్మాణం పూర్తి చేయాలి

17-11-2026 | 05:13pm

రెవెన్యూ అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ 

భూపాలపల్లి, నవంబర్ 17 (విజయ క్రాంతి): కరువు ప్రభావిత మహదేవపూర్, ముత్తారం, కాటారం, మల్హర్‌రావు, కొత్తపల్లి గోరి మండలాల్లో రైతుల రుణాల పునర్నిర్మాణ ప్రక్రియను(Farmers loan restructuring process) డిసెంబర్ 8లోగా పూర్తి చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ బ్యాంకర్లను ఆదేశించారు. మంగళవారం ఐడీఓసీలో జరిగిన జిల్లా స్థాయి బ్యాంకర్ల సమావేశంలో ఆయన బ్యాంకుల పనితీరు, రుణ లక్ష్యాలపై సమీక్షించారు. అర్హులైన రైతులకు పంట రుణాలు, కిసాన్ క్రెడిట్ కార్డులు సకాలంలో అందించాలని, పెండింగ్‌లో ఉన్న రీ-కేవైసీ ప్రక్రియను మార్చి 2027లోగా పూర్తి చేయాలని సూచించారు.

మరిన్ని వార్తలు