వరంగల్ లో దంపతుల ఆత్మహత్య

17-11-2026 | 05:12pm

పెంపుడు కుక్కను కూడా చంపేశారు

వరంగల్ (విజయక్రాంతి): వరంగల్(Warangal) నగరంలోని రంగశాయిపేట ఎస్‌బీఐ బ్యాంకు సమీపంలోని వీధిలో దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం వెలుగు చూసింది. తాము పెంచుకుంటున్న పెంపుడు కుక్కను కూడా ఆ దంపతులు విష ఆహారం కలిపి తినిపించి చంపినట్లు భావిస్తున్నారు. నల్లపోగుల సంజయ్ కుమార్ (60)ఆయన భార్య శోభ(53) ఇంట్లో ఎవరూ లేని సమయంలో విషంతో కూడిన ఆహారం తిని ఆత్మహత్యకు పాల్పడినట్లు భావిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులే దంపతుల ఆత్మహత్యకు కారణమని బంధువులు పేర్కొంటున్నారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విషాద ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు