అర్హులైన పేదలకు ఇందిరమ్మ ప్రభుత్వం అండ

17-11-2026 | 08:44pm

ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు 

-బూర్గంపాడు మార్కెట్‌ యార్డులో 846 మందికి ఇందిరమ్మ చేయూత పింఛన్ల పత్రాలు పంపిణీ

బూర్గంపాడు, (విజయక్రాంతి): అర్హులైన పేదలకు అండగా నిలుస్తూ సంక్షేమ పథకాల అమలుకు ఇందిరమ్మ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని పినపాక ఎమ్మెల్యే, శాసనసభ ఎస్టీ సంక్షేమ కమిటీ ఛైర్మన్‌ పాయం వెంకటేశ్వర్లు(MLA Payam Venkateswarlu) అన్నారు. మంగళవారం బూర్గంపాడు మండలంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా బూర్గంపాడు వ్యవసాయ మార్కెట్‌ యార్డులో నిర్వహించిన కార్యక్రమంలో 846 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ చేయూత పింఛన్లను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యమన్నారు. వృద్ధులు, దివ్యాంగులు, ఇతర అర్హులైన లబ్ధిదారులకు పింఛన్లు ఆర్థిక భరోసా కల్పిస్తాయని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమం, పేదల అభ్యున్నతే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జమలారెడ్డి, తహశీల్దార్ ప్రసాద్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మండలంలోని సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు