మంత్రి తుమ్మల జన్మదినాన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం

15-11-2026 | 06:45pm

కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు

చర్ల, నవంబర్ 15 (విజయక్రాంతి): చర్ల మండలం సుబ్బంపేట గ్రామంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Tummala Nageswara Rao) జన్మదినాన్ని పురస్కరించుకొని వర్షం రాంబాబు - సామ్రాజ్యం దంపతులకు మంజూరైన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం ఘనంగా జరిగింది. భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి నూతన ఇంటిని ప్రారంభించి, దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. 

అనంతరం మంత్రి తుమ్మల జన్మదిన వేడుకల్లో భాగంగా నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే కేక్ కట్ చేసి మంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... "మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాష్ట్ర అభివృద్ధితో పాటు రైతుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నారు. ఆయన ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు ప్రజలకు సేవలు అందించాలని ఆకాంక్షిస్తున్నాను." అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు, యూత్ నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు