ఇందిరమ్మ ఆశయాలను సాధిద్దాం

19-11-2026 | 05:58pm

నిర్మల్ నవంబర్ 19 ( విజయక్రాంతి): భారత మాజీ ప్రధానమంత్రి(Former Prime Minister of India) స్వర్గీయ ఇందిరాగాంధీ ఆశయాలను సాధిద్దామని  టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఎంబడి రాజేశ్వర్ అన్నారు. ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకుని గురువారం సోన్ మండలం గంజాల్ గ్రామంలోని ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్బంగా రాజేశ్వర్ మాట్లాడుతూ.. రోటీ, కప్డా మకాన్, గరీబీ హటావో' నినాదాలతో పేదల సంక్షేమానికి ప్రాధాన్యతనిచ్చిన ఇందిరాగాంధీ దేశాన్ని పలు రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేశారని పేర్కొన్నారు. దేశానికి ఆమె చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో గంజాల్ సర్పంచ్ చిన్న వెంకటరమణ, పీఏసీఎస్ చైర్మన్ కృష్ణప్రసాద్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మొయినుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు