నీటి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

19-11-2026 | 05:56pm

కాజీపేట (విజయక్రాంతి): కడిపికొండ హరిజనవాడ ప్రాథమిక పాఠశాలలో(Harijanawada Primary School) గురువారం పాఠశాల విద్యాశాఖ (Department of School Education) ఆదేశానుసారం జల ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో నీటి సంరక్షణ ప్రతిజ్ఞ చేయించారు. 

నీరు మన జీవనాధారమని, ప్రకృతి ప్రసాదించిన అమూల్యమైన సంపదను భవిష్యత్తు తరాల కోసం కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు చుంచుకాల లింగారావు అన్నారు. నీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించాలని, వర్షపు నీటిని ఒడిసిపట్టేందుకు ఇంకుడు గుంతలను ఏర్పాటు చేయాలని సూచించారు.

నీటి సంరక్షణ ఆవశ్యకతను కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, సమాజానికి తెలియజేయాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయురాలు సిరాజ్ బేగం మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు