హితచింతక్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

19-11-2026 | 05:53pm

విశ్వహిందూ పరిషత్ సంస్థాగత బలోపేతానికి కృషి చేయాలి.

హుజురాబాద్, నవంబర్ 19: (విజయక్రాంతి): విశ్వహిందూ పరిషత్ సంస్థాగత(Vishva Hindu Parishad organizational) బలోపేతమే లక్ష్యంగా ప్రతి గ్రామంలో హితచింతక్ కార్యక్రమాన్ని సంపూర్ణంగా పూర్తి చేయాలని ఆ సంస్థ జాతీయ సంయుక్త సంఘటన మంత్రి గుమ్మళ్ళ సత్యం జీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రఖండాల వారీగా చేపట్టిన పర్యటనలో భాగంగా గురువారం హుజురాబాద్ (ఎదులాపురం) ప్రఖండంలో ఆయన పర్యటించారు.

ఈ సందర్భంగా ఉదయం 11 గంటలకు అయ్యప్ప దేవాలయ ఆవరణలో హిందూ బంధువులు, విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు, గురుస్వాములతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సత్యం జీ మాట్లాడుతూ హుజురాబాద్ పట్టణంతో పాటు ప్రతి గ్రామంలో హితచింతక్ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో నిర్వహించాలని సూచించారు. సంస్థను క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.

అనంతరం హుజురాబాద్ పట్టణ నూతన కమిటీని ప్రకటించారు. ప్రఖండ ధర్మాచార ప్రముఖ్‌గా కొమురవెల్లి రాజు, పట్టణ అధ్యక్షులుగా అక్కినపల్లి శ్రావణ్, పట్టణ కార్యదర్శిగా కనకం శ్రీను, మండల ఉపాధ్యక్షులుగా కొండం రాజేందర్ రెడ్డి, గుడిశాల రమేష్‌లను నియమించారు.

ఈ కార్యక్రమంలో ప్రాంత సేవా ప్రముఖ్ కోమల రాజేందర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి ఉప్పల శ్యామ్, జిల్లా ఉపాధ్యక్షులు కళ్లెం సుధాకర్ రావు, మాజీ బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, ఇదూలకంటకంటి రవీందర్ రెడ్డి, కందుల శ్రీనివాస్ రెడ్డి, మండల అధ్యక్షులు కంకణాల రమేష్ రెడ్డి, మండల కార్యదర్శి భాషాబోయిన చంద్రయ్య, గోరక్ష ప్రముఖ్ రావుల సురేష్, తూర్పాటి రాజు, పరిపాటి కొండల్ రెడ్డి, దామర అనురాగ్, బండారి లావణ్యతో పాటు పలువురు కార్యకర్తలు, హిందూ బంధువులు పాల్గొన్నారు.

లక్ష్మీ గణపతి ఆలయ ప్రతిష్ఠలో పాల్గొన్న సత్యం జీఅనంతరం బోర్నపల్లి శివారులో నూతనంగా నిర్మించిన లక్ష్మీ గణపతి దేవాలయ ప్రతిష్ఠ కార్యక్రమంలో గుమ్మళ్ళ సత్యం జీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేద బ్రాహ్మణులు ప్రత్యేక పూజలు, వేద మంత్రోచ్ఛారణలతో ఆలయ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ దొంత రమేష్, ప్రధాన కార్యదర్శి అంగీరక రాజేంద్రప్రసాద్‌తో పాటు కమిటీ సభ్యులు సత్యం జీని ఘనంగా సన్మానించారు.

మరిన్ని వార్తలు