వనంలో జనం

29-11-2026 | 07:42pm

శ్రీ వాసవి ఆర్యవైశ్య కార్తీక వన సమారాధన 

పాల్వంచ, (విజయక్రాంతి):  పాల్వంచ(Palwancha) శ్రీ వాసవి ఆర్యవైశ్య కార్తీక వన మహోత్సవ ట్రస్ట్(Sri Vasavi Arya Vysya Karthika Vana Mahotsava Trust) ఆధ్వర్యంలో ఆదివారం కార్తీక మాస వన సమారాధన అత్యంత ఘనంగా నిర్వహించారు. స్థానిక హడమ్స్ ఇంజనీరింగ్ కళాశాల(Hadams Engineering College) ప్రాంగణంలో ఈ వేడుక కన్నుల పండుగ సాగింది. తొలుత సత్యనారాయణ స్వామి వారి వ్రతం భక్తిశ్రద్ధలతో(devotional) నిర్వహించారు. అనంతరం వివిధ రకాల ఆటలు, పాటల పోటీలు ఫన్నీ సన్నివేశాలతో సందడి చేశారు. విజేతలుగా గెలిచిన వారికి బహుమతులు అందజేయడం జరిగింది. కార్యక్రమానికి శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.

మరిన్ని వార్తలు