రాష్ట్ర మహిళా స్పీడ్ హ్యాండ్‌బాల్ జట్టు ఎంపిక పోటీలు
చిట్యాల, నవంబర్ 17 (విజయ క్రాంతి): చిట్యాల పట్టణంలోని లయోలా టెక్నో స్కూల్ వేదికగా(Loyola Techno School Venue) బుధవారం (నవంబర్ 18) 3వ తెలంగాణ రాష్ట్ర మహిళా స్పీడ్ హ్యాండ్‌బాల్ జట్టు(Telangana State Women’s Speed Handball Team) ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు నల్గొండ జిల్లా స్పీడ్ హ్యాండ్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు మంద వేణుగోపాల్ రెడ్డి మంగళవారం తెలిపారు.
జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు మంద వేణుగోపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఏలుగు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో జరిగే ఈ పోటీలకు వైష్ణవి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ హైదరాబాద్ చైర్మన్ మహ్మద్ కబీర్, తెలంగాణ స్పీడ్ హ్యాండ్‌బాల్ అసోసియేషన్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ సుబీర్ ఖాన్, రాష్ట్ర అధ్యక్షుడు డి. గురువేందర్, ప్రధాన కార్యదర్శి బి. పవన్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.
ఈ ఎంపిక పోటీల్లో ఉమ్మడి పది జిల్లాల నుంచి మహిళా క్రీడాకారిణులు, కోచ్‌లు, జిల్లా అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొననున్నారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్ర జట్టుకు ఎంపికైన క్రీడాకారిణులు డిసెంబర్ 23 నుంచి 25 వరకు హిమాచల్ ప్రదేశ్‌లో జరిగే జాతీయ స్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ టోర్నమెంట్‌లో తెలంగాణ తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు. ఆసక్తి, ప్రతిభ కలిగిన మహిళా క్రీడాకారిణులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంద వేణుగోపాల్ రెడ్డి కోరారు.