జాతి హక్కుల పరిరక్షణకు యువత ముందుండాలి
* మోతే లంబాడీ విద్యార్థి సేన మండల అధ్యక్షుడిగా భూక్య అనిల్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక
* తల్లిదండ్రుల ఆశీస్సులతో బాధ్యతల స్వీకరణ
* విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: అనిల్ నాయక్
మోతె, నవంబర్ 17 (విజయక్రాంతి): లంబాడీ విద్యార్థి సేన మోతె మండల అధ్యక్షుడిగా బళ్ళు తండాకు చెందిన భూక్య అనిల్ నాయక్(Bhukya Anil Naik) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్ర అధ్యక్షుడు బాలు నాయక్ ఆదేశాల మేరకు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎన్నిక నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడిని నాయకులు శాలువాతో సత్కరించి బాధ్యతలు అప్పగించారు.
లంబాడీ విద్యార్థుల హక్కుల పరిరక్షణ, విద్యా, సామాజిక సమస్యల పరిష్కారానికి యువత ఐక్యంగా ముందుకు రావాలని జిల్లా నాయకులు పిలుపునిచ్చారు. పదవిని బాధ్యతగా స్వీకరిస్తున్నానని, విద్యార్థులకు అండగా ఉంటూ జాతి హక్కుల సాధనకు కృషి చేస్తానని అనిల్ నాయక్ తెలిపారు. అనంతరం తల్లిదండ్రులు, పెద్దనాన్న ఆశీర్వాదాలు తీసుకున్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు హరీష్ నాయక్, వీరన్న నాయక్, ధరావత్ శివ నాయక్, రవి నాయక్, సుమన్ నాయక్, లక్ష్మణ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.