టీఏజీఎస్ జిల్లా 4వ మహాసభలను జయప్రదం చేయండి

19-11-2026 | 09:43pm

టిఏజిఎస్ జిల్లా కార్యదర్శి కారం పుల్లయ్య

ములకలపల్లి,(విజయక్రాంతి): ములకలపల్లి మండలం(Mulakalapalli Mandal)లో తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం(Telangana Adivasi Girijana Sangham) మండల ముఖ్య కార్యకర్తల సమావేశం గురువారం కుంజా రామ్మూర్తి అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా కార్యదర్శి కారం పుల్లయ్య మాట్లాడుతూ ఈనెల నవంబర్ 23 న ములకలపల్లి మండల కేంద్రంలో జరుగనున్న తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 4వ మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. 

ఎస్బిఐ బ్యాంకు నుండి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దగ్గర ఉన్న ఫంక్షన్ హాల్ వరకు పెద్ద ఎత్తున ఆదివాసిల ప్రదర్శన జరుగుతుందన్నారు. ఈ మహాసభలు ఆదివాసీలు తరతరాలుగా సాగు చేస్తున్న భూములకు పత్రాలు ఇవ్వాలని, ఫారెస్ట్ సిబ్బంది దాడులు ఆపాలని,జీవో నెంబర్ 3ని ఆర్డినెన్స్ ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పునరుద్ధరణ చేయాలని ఏజెన్సీ ప్రాంతంలో అన్ని  హక్కులు చట్టాలు సమస్యలు పరిష్కారం కోసం జరుగుతున్న మహాసభలు భవిష్యత్తు మూడు సంవత్సరాల క్రితం కర్తవ్యాలపై చర్చ జరుగుతుందని తెలిపారు.

ఈ మహాసభకు తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు మాజీ ఎంపీ మిడియం బాబురావు. రాష్ట్ర ఉపాధ్యక్షులు బండారు రవికుమార్ తదితర నాయకులు హాజరుకానున్నట్లు చెప్పారు.ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు గౌరీ నాగేశ్వరావు, పోడియం వెంకటేశ్వర్లు,గడ్డం వెంకటేశ్వర్లు,రావుల నాగేంద్రబాబు,దుర్గయ్య, రాఘవయ్య, కొయ్యల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు