ఆరోగ్య లక్ష్యాల సాధనకు సమష్టి కృషి చేయాలి

19-11-2026 | 10:08pm

బూర్గంపాడు,(విజయక్రాంతి): జాతీయ ఆరోగ్య కార్యక్రమాల(National Health Programmes) లక్ష్యాలను వందశాతం సాధించాలని డీడీఓ డాక్టర్ ప్రసాద్ వైద్య సిబ్బందికి సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఆదేశాల మేరకు గురువారం మోరంపల్లి బంజర ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శ్రమదానం, సహపంక్తి భోజనం నిర్వహించారు. సిబ్బందితో కలిసి ఆయన ఆసుపత్రి పరిసరాలను శుభ్రం చేశారు.

అనంతరం సిబ్బంది సమిష్టిగా వంటలు తయారు చేసుకుని సహపంక్తి భోజనం చేశారు.ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో డాక్టర్ ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి వారం జాతీయ ఆరోగ్య కార్యక్రమాల్లో పురోగతి సాధించాలని, నెలాఖరులోగా నిర్దేశించిన లక్ష్యాలను వందశాతం పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ అనిత, వైద్య సిబ్బంది, సూపర్‌వైజర్లు, స్టాఫ్ నర్సులు, ఎంఎల్‌హెచ్‌పీలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు