కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

19-11-2026 | 09:47pm

ఖానాపూర్,(విజయక్రాంతి): కడెం మండలం లక్ష్మీపూర్ (నవాబుపేట) గ్రామంలో నూతనంగా నిర్మించిన వివో భవనాన్ని, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్  ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ... మహిళా సంఘాల బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తోందని, ఇందిరమ్మ జీవిత బీమా పథకం ద్వారా పేద మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డి ఆర్ డి ఓ విజయలక్ష్మి స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు