వీబీజీ రామ్ జీ పథకం సద్వినియోగం చేసుకోవాలి
19-11-2026 | 09:59pm
బేల నవంబర్ 19(విజయక్రాంతి): వీబీజీ రామ్ జీ పథకం కింద కల్పిస్తున్న 125 రోజుల ఉపాధి పనిదినాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లోని కూలీలు, రైతులు ఈ పథకం ద్వారా లభించే ఉపాధి అవకాశాలను వినియోగించుకోవాలని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకం ప్రయోజనాలు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.