మాజీ ప్రధాని దివంగత ఇందిరా గాంధీ జయంతి
బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కాంగ్రెస్ కార్యాలయంలో(Bellampalli Congress Office) మాజీ ప్రధాని దివంగత ఇందిరా గాంధీ జయంతి వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ కేక్ కట్ చేసి ఇందిరాగాంధీకి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తుది శ్వాస విడిచే వరకు భారతదేశ అభివృద్ధి కోసం ఇందిరా గాంధీ పాటుపడ్డారన్నారు.
చివరికి దేశం కోసం తన ప్రాణాన్ని త్యాగం చేశారని తెలిపారు. ఇందిరా గాంధీ ఆశయ సాధనకు ప్రతీ కాంగ్రెస్ కార్యకర్త కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటారు.
కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఆవరణలో నూతనంగా నిర్మించిన మరుగుదొడ్లను ఎమ్మెల్యే గడ్డ వినోద్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి మున్సిపల్ చైర్పర్సన్ బావ స్వాతి రమేష్ బాబు, బెల్లంపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బండి ప్రభాకర్, టీపీసీసీ సభ్యుడు చిలుముల శంకర్, సీనియర్ నాయకులు మల్లారం చినరాజం, అధికార ప్రతినిధి దేవసాని ఆనంద్, కౌన్సిలర్లు చైర్మన్ మాజీ చైర్మన్లు, కౌన్సిలర్లు మాజీ కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.