గుడిబండ గ్రామంలో నూతనంగా మంజూరైన పింఛన్ల పంపిణీ
కోదాడ నవంబర్ 19(విజయక్రాంతి): కోదాడ మండలంలోని గుడిబండ గ్రామంలో(Gudibanda Village) నూతనంగా మంజూరైన పింఛన్లను గ్రామ సర్పంచ్ మందుల నాగయ్య ఆధ్వర్యంలో గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి , ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి సహకారంతో గ్రామానికి కొత్తగా 70 పెన్షన్లు మంజూరైనట్లు తెలిపారు.
వీటిని లబ్దిదారులకు అందజేశామన్నారు. పింఛన్ల మంజూరుకు సహకరించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి కి, ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ జయసింహారెడ్డి , గ్రామ కార్యదర్శి అవినాష్ రెడ్డి , గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తుమాటి వరప్రసాద్ రెడ్డి , ఇర్ల నరసింహారెడ్డి , ఎస్.కె. రఫీ , వార్డు సభ్యులు, గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.