ఘనంగా ఇందిరా గాంధీ జయంతి
కోదాడ నవంబర్ 19(విజయక్రాంతి): భారత మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ(Former Prime Minister of India Indira Gandhi) జయంతి సందర్భంగా గురువారం పట్టణంలో ఇందిరా గాంధీ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ సేవలను కొనియాడారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ చైర్మన్ వంగవీటి రామారావు, మున్సిపల్ చైర్మన్ ఎర్నేని కుసుమ బాబు, మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లేశ్వరి మాజీ సర్పంచ్ ఎర్నేని బాబు ఫ్లోర్ లీడర్ కందుల కోటేశ్వరావు సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి , బాగ్దాద్, బాజాన్, కౌన్సిలర్స్ కొల్లా కోటిరెడ్డి, షాబుద్దీన్, చైతన్య, గోపి, పాస్టర్ ఏసయ్య, ఉప్పగళ్ళ శ్రీనివాస్, పంది తిరపయ్య, అల్లీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు