బతుకమ్మ.. ఓ పోరాటం!

18-10-2026 | 05:05am

తెలంగాణ(Telangana) నేలపై ప్రకృతితో మమేకమైన బతుకమ్మ దళిత బహు జన మహిళల సాంస్కృతిక(Dalit Bahujan women's cultural) ప్రతీక. సామూహిక చైతన్యానికి, త్యాగానికి, పోరాటానికి నిదర్శనం. మహిళల ఆత్మగౌరవా నికి ప్రతిబింబం. దేశంలోనే ప్రత్యేకమైన సాంస్కృతిక వైవిధ్యాన్ని చాటిచెప్పే అరుదైన ప్రకృతి పం డుగ బతుకమ్మ.  చారిత్రకంగా తెలంగాణలో బతుకమ్మను పరిశీలిస్తే, దళితబహు జన మహిళలే ఈ పండుగను ప్రధానంగా జరుపుకునేవారు.

ఆధిపత్య వర్గాలు ఈ పండుగకు దూరంగా ఉండేవారు. బహుజన మహిళలంతా సహజంగా లభించే రంగురంగుల పూల తో ఘనంగా జరుపుకునేవారు. పూలను పేర్చి బతుకమ్మను రూపొందించడం, సంప్రదాయ పాటలు పాడటం, సామూహికంగా ఆడటం ద్వారా తమ ప్రకృతి అనుబంధాన్ని, జీవన సం స్కృతిని చాటేవారు. పూజ పూజారి లేకుండా శ్రమ జీవుల  జీవితాలు, ఆశలు, ఆకాంక్షలు, సామాజిక అనుభవాలు ప్రతిబింబించేవి.

ఉత్సవం కాదు పోరాటమే!

బతుకమ్మ కేవలం ఒక వేడుక మాత్ర మే కాదు, అది బహుజనుల అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి, శ్రమ సంస్కృతికి సజీవ సాక్ష్యం. చరిత్రను వివిధ కోణాల్లో విశ్లేషించినప్పటికీ, కాకతీయ ప్రతాపరుద్రుడి చేతిలో ఓడిపోయిన సమ్మక్క, సారక్క, పగిడిద్దరాజుల పోరాటానికి తెలంగాణ చరిత్ర లో ప్రత్యేక స్థానం ఉంది. వారి పోరాటానికి మద్దతుగా ప్రజలు వారిని దేవతలుగా కొలుస్తూ, తమ నిరసనను, ఆత్మగౌరవాన్ని చాటుకుంటున్నారనే చరిత్ర చెబుతుంది.

దాదాపు ఏడు శతాబ్దాల తర్వాత కూడా రెండేళ్లకోసారి లక్షలాది మంది మేడారంలో సమావేశమవడం తెలంగాణ ప్రజ ల సామూహిక చైతన్యానికి నిదర్శనం. అయితే బతుకమ్మ ఉత్సవమే సమ్మక్క-సారక్క జాతరకు మూలాధారంగా వారు త్యాగాన్ని, పోరాటాన్ని కీర్తిస్తూ మళ్ళీ రావాలని బహుజన మహిళలు ఆడే ఆటగా చరిత్ర కారులు భావిస్తున్నారు. కాకతీయు ల కాలంలో వికసించిన స్త్రీ శక్తి రూపం బతుకమ్మ అయితే, అ

దే కాకతీయుల నిరంకుశ పన్నుల విధానాన్ని ఎదిరించి గిరిజన ఆత్మగౌరవ ప్రతీకలుగా నిలిచిన వీరనారులు సమ్మక్క-సారలమ్మలే నేటి బతుకమ్మలు. తెలంగాణ గడ్డపై దొరల, భూస్వాముల గడీలో బహుజన మహిళలు తీవ్రమైన దోపిడీకి, లైంగిక అణచివేతకు గురయ్యారు. ఆ అణచివేతను భరించలేక ఆత్మహత్యలు చేసుకున్న లేదా దొరల చేతిలో హతమైన దళిత, బహుజన ఆడబిడ్డలను స్మరిస్తూ... ‘నువ్వు చావలేదు,

మళ్లీ బతుకమ్మా‘ అని తోటి మహిళలు పాటల రూపంలో ఓదార్చిన సాంస్కృతిక వేదికే ఈ పండుగ. బతుకమ్మ పాటల్లోని ‘ఉయ్యాల్లో.. ఉయ్యాల..‘ అనే లయ వెనుక శ్రమజీవుల కన్నీళ్లు, గడీల దోపిడీపై నిరసన దాగి ఉన్నాయాని బహుజన విశ్లేషకులు చెప్తారు. ఈ చరిత్ర వాస్తవాలు పరిశీలిస్తే బతుకమ్మ అణగారిన వర్గాల ధిక్కార స్వరం. అణచివేత, ఓటమి,దోపిడిని ఎదుర్కొన్న బహుజన సమాజం తన అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని, పోరాటాన్ని బతుకమ్మ రూపంలో వ్యక్తం చేస్తున్నారు.

ఆధిపత్య సంస్కృతి ప్రభావం

తెలంగాణలోని అధికార, భూస్వామ్యవర్గాల ఆధిపత్యానికి అభిముఖంగా బతుకమ్మ అట్టడుగు వర్గ మహిళ సామాజిక శక్తిని చాటింది. తెలంగాణ ఉద్యమ కాలంలో, అనంతరం ఈ పండగ నిర్వహణలో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. గతంలో బతుకమ్మను బహుజన మహిళలు తమ జీవన సంస్కృతిలో భాగంగా జరుపుకుంటే, అగ్రకుల దొరసానులు ఈ ఆటలో ప్రవేశించి దాని రూపురేఖలు మార్చారు.

గ్రామీణ సంప్రదాయ పాటలు, సంస్కృతి, ప్రకృతి ఆరాధన స్థానంలో డీజేలు, కృత్రిమ పాటలు, భారీ శబ్దాలు, ప్రదర్శనాత్మక సంస్కృతి విస్తరించాయి. బతుకమ్మకు విస్తృత ప్రచారం లభించినప్పటికీ, దాని వెనుక ఉన్న సామాజిక చరిత్ర, బహుజన మహిళల పాత్ర, పోరాట స్ఫూర్తి మరుగునపడ్డాయి. అగ్రకుల దొరసానులే బతుకమ్మకు ఐకాన్‌గా మారి అధికార స్థానాల్లో రాణిస్తున్నారు. బతుకమ్మ చీరలతో మభ్యపెడుతూ బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలను ఓటు బ్యాంకుగా మార్చుకుంటున్నారు.

ఇది ముమ్మాటికీ దళిత బహుజన మహిళల పోరాట స్ఫూర్తిని పక్కదారి పట్టించి, వారి సాంస్కృతిక అస్తిత్వంపై ఆధిపత్యాన్ని బలపరిచే చర్య. బతుకమ్మతోనే ఈ ధోరణి పరిమితం కాలేదు. బహుజన సమాజానికి చెందిన అనేక పండుగలు, జానపద సంప్రదాయాలు, సాంస్కృతిక ప్రతీకలు కూడా క్రమంగా ఆధిపత్య వర్గాల చేతుల్లోకి వెళ్లి కొత్త అర్థాలను సంతరించుకుంటున్నాయి. అందుకే బహుజన మహిళలు తమ పండుగల చరిత్రను, సాంస్కృతిక వారసత్వాన్ని, పోరాట స్ఫూర్తిని తామే కాపాడుకోవాల్సిన అవసరం ఉంది.

ఓటు శక్తిగా మారినప్పుడే..

బహుజన అస్తిత్వానికి ప్రతీకగా నిలిచిన బతుకమ్మను తెలంగాణ అస్తిత్వ చిహ్నంగా చాటుతూ ఉద్యమానికి ఊపిరి పోశారు. కానీ తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన బహుజనులకు రాజ్యాధికారంలో తగిన వాటా దక్కలేదనే ప్రశ్న నేటికీ వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో బహుజన మహిళలంతా ఓటు శక్తిగా ఏకమై, బీసీ, ఎస్సీ, ఎస్టీల రాజ్యాధికారానికి పునాది వేయాల్సిన చారిత్రక అవసరం ఉంది.

మన రాజ్యాంగం మహిళలకు సమానత్వం, స్వేచ్ఛ, గౌరవం, వివక్షకు వ్యతిరేకంగా రక్షణ కల్పించే హక్కులను ప్రసాదించింది. ఫలితంగా మహిళలకు విద్య, ఉద్యోగాలు, రాజకీయ ప్రాతినిధ్యం, స్థానిక సంస్థల్లో నాయకత్వం వహించే అవకాశాలు విస్తరించాయి. ఈ క్రమంలో తెలంగాణ చరిత్రలో సమ్మక్క పోరాట స్ఫూర్తితో బతుకమ్మ ఆడాలి. బతుకమ్మను పేర్చే చేతులతోనే ఓటును ఆయుధంగా మార్చుకుని బహుజన రాజ్యాన్ని నిర్మించాలి. అప్పుడే బతుకమ్మ పండుగకు నిజమైన సార్థకత.

 వ్యాసకర: సామాజిక విశ్లేషకులు 7989579428


మరిన్ని వార్తలు