డిక్లరేషన్‌పై ఇక బీసీలదే డెసిషన్!
కామారెడ్డి(Kamareddy)లో 2023 నవంబర్ 10న కాంగ్రెస్ పార్టీ బీసీలకు 21 ప్రధాన హామీలను ప్రకటించింది. నేటికీ మూడేండ్లు పూర్తయింది. బీసీల అభ్యున్నతి, ఆర్థిక సాధికారత, విద్యాభివృద్ధి, ఉద్యోగావకాశాలు, రాజకీయ ప్రాతినిధ్యం వంటి అంశాలపై అనేక వాగ్దానాలు చేసిం ది. వాటిని నమ్మిన బీసీ సమాజం కాంగ్రె స్ అధికారంలోకి రావడానికి తనవంతు రాజకీయ మద్దతును అందించింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రె స్ పార్టీ కామారెడ్డిలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌ను కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామ య్య విడుదల చేశారు.
1. డిక్లరేషన్‌లో కీలక హామీ- ఫైనాన్స్
బీసీలకు ఏటా 20 వేల కోట్ల హామీ, 5 ఏళ్లలో లక్ష కోట్ల ఖర్చు- ఇది ఉత్తుత్తి వాగ్దానమేనని తేలిపోయింది. రాష్ట్ర బడ్జె ట్లో 90 శాతం ఖర్చు చేస్తున్న ప్రభు త్వం బీసీలకు కేటాయించిన నిధుల్లో కనీసం 25 శాతం కూడా ఎందుకు ఖర్చు చేయలేకపోయింది? బీసీలంటే అంత నిర్లక్ష్యమా? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత మూడు ఆర్థిక సంవత్సరాల బడ్జెట్ కేటాయింపులు, వాస్తవ వ్యయాలను పరిశీలిస్తే డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీ కి, ప్రభుత్వ ఆచరణకు మధ్య భారీ వ్యత్యాసం కనిపిస్తుంది.
మూడేళ్లలో ఏటా రూ.20,000 కోట్ల హామీ మేరకు పూ60,000 కోట్లు కేటాయించాల్సి ఉండగా, రూ.33,116 కోట్లకే పరిమితమయ్యాయి. అంటే మూడేళ్లలో హామీ మొత్తంతో పోలిస్తే రూ26,884 కోట్లు తక్కువగా కేటాయించారు. ఖర్చు గత రెండేళ్లలో కేవలం 5140 కోట్లు.
2. కేటాయింపులు.. ఖర్చులు వేర్వేరు!
బడ్జెట్లో కేటాయింపులు ప్రకటించడం మాత్రమే అభివృద్ధి కాదు. ఆ నిధులను విడుదల చేసి, పథకాల ద్వారా బీసీలకు వాస్తవంగా ప్రయోజనం చేకూర్చాలి.
ఈ రెండు సంవత్సరాల్లో కేటాయించిన రూ.20,605 కోట్లలో ఖర్చు చేసింది కేవలం రూ.5,143.25 కోట్లు మాత్రమే. అంటే సుమారు 24.96 శాతం మాత్రమే ఖర్చు చేశారు. మిగిలిన రూ.15,461.75 కోట్లు ఖర్చు చేయలేదు. ఇక 2026 27 ఆర్థిక సంవత్సరం ఇంకా కొనసాగుతున్నందున దాని తుది వ్యయ గణాంకాలు రావా ల్సి ఉంది. ఈ సంవత్సరం కూడా ఇంచుమించు ఇదే వ్యయం ఉండబోతుంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, బీసీ బడ్జెట్‌లో 10 శాతం ఈబీసీలకు సం బంధించిన కేటాయింపులు కూడా ఉన్నా యి.( మూలం- బడ్జెట్ పుస్తకాలు ).
3. రాష్ట్ర బడ్జెట్‌తో పోల్చితే బీసీల పట్ల నిర్లక్ష్యం మరింత స్పష్టం.
ఇక్కడే అసలు ప్రశ్న ఉత్పన్నమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం బడ్జెట్‌లో సుమారు 91.93 శాతం ఖర్చు చేసింది. మరి అదే ప్రభుత్వం బీసీలకు కేటాయించిన బడ్జెట్‌లో కేవలం 24.96 శాతం మాత్రమే ఎందుకు ఖర్చు చేసింది? రాష్ట్రంలోని ఇతర శాఖలకు నిధులు ఖర్చు చేయగలిగిన ప్రభుత్వం బీసీల సంక్షేమానికి కేటాయించిన నిధులను ఎందుకు పూర్తిస్థాయిలో వినియో గించలేకపోయింది? ఈ ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి.
4. వెనుకబడిన కులాల అభివృద్ధేది?
బీసీలలోనే అత్యంత వెనుకబడిన కులాలు (ఎంబీసీలు), సంచార జాతులు, విముక్త జాతులు, వృత్తి ఆధారిత చిన్న కులాలు ఆర్థికంగా, సామాజికంగా తీవ్ర వెనుకబాటుతనాన్ని ఎదుర్కొంటున్నాయి. వారి అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యాచరణ, ప్రత్యేక ఆర్థిక సహాయం, ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉంది. కులాలవారీగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసినప్పటికీ, వాటికి బడ్జెట్లో కేటాయించిన నిధులు, విడుదల ఖర్చుల వివరాలు క్రింది పట్టికలో ఇవ్వబడినవి.
గత సంవత్సరం కూడా బీసీ కార్పొరేషన్లకు/ఫెడరేషన్స్‌కు ఇవే కేటాయింపులు, ఖర్చు సున్నా. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం కూడా ఇదే నిర్లక్ష్యం. అందుకే తగిన మూల్యం చెల్లించుకుంది. తెలంగాణ వచ్చిన తర్వాత గత 12 ఏళ్లుగా ఆధిపత్య కుల పాలకులు బీసీలను అన్ని రంగాలలో అణగదొక్కుతున్నారు.
5. ప్రభుత్వాన్ని నిలదీయాలి!
బీసీ లు ఆర్థికంగా అభివృద్ధి కావద్దా?, కేవలం వారు ప్రభుత్వ సబ్సిడీల మీదనే బతుకాలా ? ఇదేనా ఆధిపత్య కుల ప్రభుత్వాల వైఖరి.బీసీల జనాభా 56 శాతానికి పైగా ఉన్న రాష్ట్రంలో వారి ఆర్థికాభివృద్ధికి తగిన నిధులు ఖర్చు చేయకుండా ఉంటే బీసీల అభివృద్ధి ఎలా సాధ్యమవుతుంది
లక్షల కోట్లతో సాగు నీటి ప్రాజెక్టులు, మూసి అభివృద్ధి, మెట్రో రైల్, ఫ్యూచర్ సిటీ, యంగ్ ఇండియా స్కూల్ భవనాల నిర్మాణం చేపట్టుతున్న మీకు బీసీ లకు ఇవ్వటానికి మాత్రమే డబ్బులు కరువైనయ? అని బీసీ సమాజం ప్రశ్నిస్తుంది? కామారెడ్డి బీసీ డిక్లరేషన్ కేవలం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల పత్రంగా మిగిలిపోకూడదు. ఈ హామీ బీసీ సమాజానికి ఇచ్చిన రాజకీయ, ఆర్థిక, సామాజిక న్యాయ వాగ్దానం.
6. 42% రిజర్వేషన్లలో- మోసం
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం.. కేంద్ర ప్రభుత్వ ఉదాసీనత! కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావస్తున్నా ఆ హామీని నెరవేర్చలేకపోయింది. 50 శాతం రిజర్వేషన్ల పరిమితి వల్ల న్యాయపరమైన సమస్యలు ఎదురవుతాయనే కారణంతో బీసీ సంఘాల డిమాండ్ మేరకు సంబంధిత బిల్లులను తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలని కేంద్రానికి పంపించి రాష్ట్ర ప్రభుత్వం చేతులు దులుపుకుంది.
వాటి ఆమోదం కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చిన దాఖలాలు లేవు. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఒకరోజు ధర్నా చేస్తే సరిపోతుందా? ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని కలిసి ఈ సమస్యపై చర్చించారా? అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లారా? మాట్లాడితే 50శాతం సీలింగ్ బద్దలు కొట్టుతామని పలికే రాహుల్ గాంధీ పార్లమెంట్‌లో ఈ విషయాన్ని ప్రస్తావించారా? 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని బద్దలు కొడతామని ప్రకటించిన కాంగ్రెస్ నాయకత్వం, తెలంగాణ బీసీలకు ఇచ్చిన హామీ అమలులో ఎందుకు చొరవ చూపడం లేదు? ఇది మోసపూరిత వైఖరి కదా? హామీ ఇచ్చినప్పుడు న్యాయపరమైన సమస్యలుంటా యని వారికి తెలియదా? రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం, కేంద్ర ప్రభుత్వ ఉదాసీనత మధ్య బీసీ నిరుద్యోగ యువత భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోంది. అందుకే ఈ మధ్య బీసీ యువత ఆత్మ హత్యలకు పాల్పడుతున్న ఘటనలు మళ్లీ పునరావృతమ వుతున్నవి.
7. నామినేటెడ్ పోస్టుల్లో కూడా..
గత మూడేళ్ల కాంగ్రెస్ పాలనలో బీసీలు రాజకీయంగా తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యారు. నామినేటెడ్, కార్పొరేషన్ చైర్మన్ పదవుల్లో నామమాత్రపు ప్రాతినిధ్యమే కల్పించారు. అసెంబ్లీలో బీసీల సంఖ్య అసలే తక్కువ. కనీసం అత్యంత వెనుకబడిన వర్గాలకు నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవు లైన ఇవ్వాలని సోయి లేదు వీరికి. చట్ట సభలలో అంత ఆధిపత్య కులాలే. ఈ మధ్య రెండు ఎమ్మెల్సీ పదవులనూ ఆధిపత్య కులాలకే కేటాయించగా, మంత్రివ ర్గంలో సైతం బీసీలను ఇద్దరికే పరిమితం చేశారు. తెలంగాణలో బలంగా సాగుతున్న బీసీ ఉద్యమాన్ని సైతం ప్రభుత్వం పట్టించుకోకపోవడంలేదు. ఇది బీసీల ఆత్మగౌర వాన్ని దెబ్బతీయడమే. అభివృద్ధి, సంక్షే మం మాత్రమే కాదు, అధికారంలోనూ బీసీలకు జనాభా దామాషా ప్రకారం వాటా కల్పించాలి.
V-. ఆత్మపరిశీలన అవసరం
బీసీల ఓట్లతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం, వారికి ఇచ్చిన హామీల అమలులో విఫలమవడం తీవ్రమైన తప్పిదం. రాజకీయ అవసరాల కోసం హామీలిచ్చి, అధికారంలోకి వచ్చాక విస్మరిస్తే బీసీ సమాజం మౌనంగా ఉండదు. మూడు సంవత్సరాల పాలన తర్వాత కూడా బీసీలు తమ హక్కుల కోసం రోడ్లపైకి రా వాల్సి రావడం వారి వైఫల్యం కాదు; ప్రభుత్వమే సృష్టించిన పరిస్థితి. ప్రజాస్వామ్యంలో బీసీలు కేవలం ఓటర్లు కాదు, అధికారంలో సముచిత వాటా కోరే హక్కుదారులు. ఈ వాస్తవాన్ని ప్రభుత్వాలు గుర్తించాలి. ఇచ్చిన హామీలను విస్మరిస్తే ప్రజల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. గతంలో బీసీలకు వ్యతిరేకంగా పనిచేసిన బీఆర్‌ఎస్ ప్రభుత్వంను ప్రజలు ఎక్కడ కుర్చోబెట్టారో గుర్తు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. బీసీ ప్రజలు ఒకటే గుర్తు పెట్టుకోవాలి. ఈ ఆధిపత్య కులాల పాల నలో మనకు న్యాయం జరగదు. మన ఓట్లతో మన రాజ్యం తెచ్చుకోవాల్సిందే. అందుకు మనం సంసిద్ధం కావాల్సిందే.
రాష్ట్ర బడ్టెట్.. నిధుల వ్యయం
ఆర్థిక సంవత్సరం రాష్ట్ర బడ్జెట్ రాష్ట్ర వ్యయం
2024 రూ.2.91 లక్షల కోట్లు రూ.2.66 లక్షల కోట్లు
2025 రూ.3.04 లక్షల కోట్లు రూ.2.81 లక్షల కోట్లు
మొత్తం రూ.5.95 లక్షల కోట్లు రూ.5.47 లక్షల కోట్లు
ప్రభుత్వం వ్యయ గణాంకాల ప్రకారం
ఆర్థిక సంవత్సరం కేటాయింపు వాస్తవ ఖర్చు
2024 రూ.9,200 కోట్లు రూ.2,285.93 కోట్లు
2025 రూ.11,405 కోట్లు రూ.2,857.32 కోట్లు
మొత్తం రూ.20,605 కోట్లు రూ.5,143.25 కోట్లు
వ్యాసకర్త: విశ్రాంత ఐఏఎస్,
బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్
టీ చిరంజీవులు