స్థానిక ఉత్పత్తిదారులకు మార్కెటింగ్ అవకాశాలు కల్పించాలి
17-11-2026 | 07:19pm
వాంకిడి (విజయక్రాంతి): స్థానిక ఉత్పత్తిదారులకు మరిన్ని ఉపాధి, మార్కెటింగ్ అవకాశాలు కల్పించాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి మంద మకరందు అధికారులకు సూచించారు. మంగళవారం వాంకిడి మండలంలోని కామన్ ఫెసిలిటీ సెంటర్(Common Facility Center)ను సందర్శించి అక్కడి యంత్రాలు, మౌలిక సదుపాయాలు, సేవలను పరిశీలించారు.
సెంటర్లో అందుబాటులో ఉన్న సౌకర్యాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని, గిరిజన యువతకు స్వయం ఉపాధి అవకాశాలు పెంచాలని ఆదేశించారు. స్థానిక ఉత్పత్తులకు మెరుగైన మార్కెటింగ్ కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో ఈఈ తానాజీ, ఏపీవో జనరల్ వసంతరావు తదితరులు పాల్గొన్నారు.