ధ్రువపత్రాలు గడువులోగా జారీ చేయాలి

17-11-2026 | 07:29pm

వాంకిడి (విజయక్రాంతి): విద్యార్థులు, ప్రజలు మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకున్న వివిధ ధ్రువపత్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ణీత గడువులోగా జారీ చేయాలని జిల్లా కలెక్టర్ కె.హరిత(Collector Haritha) అధికారులను ఆదేశించారు. మంగళవారం వాంకిడి తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించి రికార్డులను తనిఖీ చేశారు. నివాస, ఆదాయ, కుల, కుటుంబ సభ్యుల ధ్రువపత్రాలతో పాటు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని సూచించారు. అనంతరం ఆధార్ కేంద్రాన్ని సందర్శించి పనితీరును పరిశీలించారు.

మరిన్ని వార్తలు