600 మందికి పింఛన్ల పంపిణీ

17-11-2026 | 07:25pm
  1. నియోజకవర్గానికి కొత్తగా 4,900 పింఛన్లు మంజూరు
  2. మంజూరు పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి

నల్లబెల్లి, నవంబర్ 17( విజయ క్రాంతి ): పేదలు, వృద్ధులు, దివ్యాంగులకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం సంక్షేమ పథకాలను(Public government welfare schemes) పక్కాగా అమలు చేస్తోందని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి(MLA Donthi Madhava Reddy) పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన చేయూత పింఛన్లకు సంబంధించి నల్లబెల్లి మండలంలోని 600 మంది లబ్ధిదారులకు మంజూరు పత్రాలను ఆయన అందజేశారు. మంగళవారం మండల కేంద్రంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. నాలుగు దశాబ్దాల క్రితమే రూ.60తో పింఛన్ పథకానికి కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని గుర్తు చేశారు. ఒకేసారి ఇంత భారీ సంఖ్యలో పింఛన్లు మంజూరు చేయడం చరిత్రలో నిలిచిపోతుందన్నారు.

పరిశీలనలో మరో 400 దరఖాస్తులు

నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం 4,900 కొత్త పింఛన్లు మంజూరయ్యాయని, మరో 400 దరఖాస్తులు పరిశీలన దశలో ఉన్నాయని వెల్లడించారు. కొత్త పింఛన్లు మంజూరు కావడంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు