సర్వజ్ఞ స్కూల్‌కు బంగారు పతకాలు

17-11-2026 | 07:18pm

ఖమ్మం ఎడ్యుకేషన్ విజయక్రాంతి: చంద్రకళ మెమోరియల్(Chandrakala Memorial) ఓపెన్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్–2026(Table Tennis Championship) రాష్ట్రస్థాయి పోటీల్లో సర్వజ్ఞ స్కూల్ విద్యార్థులు సత్తా చాటి నాలుగు బంగారు పతకాలు సాధించారు. అండర్-14 విభాగంలో హరి, చార్విక్, అండర్-17 విభాగంలో పజల్, తరుణ్ విజేతలుగా నిలిచారు. 

ఈ సందర్భంగా పాఠశాల ఛైర్మన్ ఆర్.వి. నాగేంద్ర కుమార్, డైరెక్టర్ కె. నీలిమ విజేతలను అభినందించి, భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.

మరిన్ని వార్తలు