జ‌ర్న‌లిస్టుల‌నస‌న్మానించిన అధికారులు, ప్ర‌జాప్ర‌తినిధులు

17-11-2026 | 07:28pm

మునిప‌ల్లి నవంబర్ 17 ( విజయక్రాంతి )ః  జాతీయ పత్రికా దినోత్సవం(National Press Day) సంద‌ర్భంగా మండంలోని అల్లాపూర్ గ్రామ స‌ర్పంచ్ అంకెన్ ప‌ల్లి నారాయ‌ణ  ఆధ్వ‌ర్యంలో మంగ‌ళ‌వారం మండ‌ల కేంద్ర‌మైన మునిప‌ల్లి రైతు వేదికలో మండ‌లంలోని జ‌ర్న‌లిస్టుల‌కు స‌న్మాన కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు.ఈ సంద‌ర్భంగా ఎమ్మార్వో హాజ‌రై జ‌ర్న‌లిస్టుల‌నుద్దేశించి మాట్లాడారు. 

ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావడంలో జ‌ర్న‌లిస్టులు అందిస్తున్న సేవలు  అభినంద‌నీయ‌మ‌న్నారు. జర్నలిస్టులు త‌మ త‌మ ప‌త్రిక‌లు, టీవీల్లో   అందించే సమాచారం ద్వారా అనేక సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు అవకాశం  ఉంటుంద‌న్నారు. అనంత‌రం అల్లా పూర్ గ్రామ స‌ర్పంచ్ నారాయ‌ణ మాట్లాడుతూ ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లను వెలికి తీయ‌డంలో జ‌ర్న‌లిస్టులు ముఖ్యపాత్ర పోషిస్తున్నార‌ని తెలిపారు. అంతకు ముందు జ‌ర్న‌లిస్టులంద‌రికి జాతీయ ప‌త్రికా దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలిపారు.

ఈ కార్య‌క్ర‌మంలో డిప్యూటీ ఎమ్మార్వో ప్ర‌దీప్, మాజీ స‌ర్పంచ్ వీర‌న్న పాటిల్, మాజీ ఎంపీటీసీ వెంక‌ట్రాములు, అల్లాపూర్, చీల‌ప‌ల్లి గ్రామాల ఉప స‌ర్పంచులు  స‌ర్పంచ్ మొహీద్దీన్ , గొంగ‌ళ్ల రాజు,   నాయ‌కులు మ‌న్నె రాజు, మొగుల‌య్య, మండ‌లంలోని జ‌ర్న‌లిస్టులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు