ఆర్టీసీ బస్సు రాక కోసం రహదారి పరిశుభ్రత పనులు ప్రారంభం
మల్లాపూర్, నవంబర్ 17 (విజయక్రాంతి): మల్లాపూర్ మండల కేంద్రంలోని(Mallapur Mandal Headquarters) నల్ల (బొంబాయి) పోచమ్మ ఆలయం నుంచి గుండంపల్లి రహదారిపై గ్రామ సరిహద్దు వరకు ఇరువైపులా పెరిగిన పిచ్చి మొక్కలు, చెట్ల తొలగింపు పనులను మంగళవారం మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్ ఆధ్వర్యంలో ప్రారంభించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్ మాట్లాడుతూ.. కోరుట్ల నుంచి గుండంపల్లి మీదుగా మల్లాపూర్, ఖానాపూర్ వరకు ఆర్టీసీ బస్సు సర్వీసును ప్రారంభించనున్న నేపథ్యంలో రహదారికి ఇరువైపులా పరిశుభ్రత పనులు చేపడుతున్నట్లు తెలిపారు. బస్సు ప్రయాణానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రహదారిని శుభ్రం చేసి, ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడమే లక్ష్యమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గడ్డం సోమరెడ్డి, పాలకవర్గ సభ్యులు కొంపెల్లి రాకేష్, ముష్కరి రమేష్, ముత్యాల గంగారాజం, అల్లె చంద్రయ్య, కదుర్క రాజేందర్, మొరపు గంగారాజం, పోచంపల్లి బుచ్చిరమేష్, ముష్కరి సురేందర్, రాజ్ కుమార్, సామాజిక కార్యకర్త ఏనుగు వెంకట్ రెడ్డి (ఏవీఆర్), గ్రామస్థులు పాల్గొన్నారు.