టి.ఏ.జి.ఎస్ మహాసభలను జయప్రదం చేయాలి
17-11-2026 | 07:35pm
ఆసిఫాబాద్, నవంబర్ 17 (విజయక్రాంతి): ఈ నెల 27, 28 తేదీల్లో జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న టి.ఏ.జి.ఎస్ 4వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని జిల్లా కార్యదర్శి కోరేంగ మాలశ్రీ(TAGS District Secretary Korenga Malashree) పిలుపునిచ్చారు. మంగళవారం ఎమ్మెల్యే కోవ లక్ష్మి వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఆదివాసీల భూమి, పోడు భూములు, అటవీ హక్కుల పరిరక్షణ కోసం మహాసభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోట శ్రీనివాస్, ముంజం ఆనంద్ కుమార్, దుర్గం దినకర్, గొడిసెల కార్తీక్, నరేష్, గునవంతరావు తదితరులు పాల్గొన్నారు.