అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే
ఖానాపూర్ (విజయక్రాంతి): ఖానాపూర్ మండలంలోని సుర్జాపూర్, మస్కాపూర్ గ్రామాల్లో అభివృద్ధి పనులకు భూమిపూజ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్(MLA Vedma Bhojju Patel) భూమి పూజ చేశారు. ఖానాపూర్ మండలంలోని సుర్జాపూర్ గ్రామంలో రూ.10 లక్షల వ్యయంతో నిర్మించనున్న వీవో భవనా నిర్మాణ పనులు ప్రారంభించారు.
అనంతరం మస్కాపూర్ గ్రామంలో రూ.10 లక్షల వ్యయంతో నిర్మించనున్న వీవో భవనానికి, రూ.5 లక్షల వ్యయంతో నిర్మించనున్న మున్నూరు కాపు సంఘ భవనానికి, అలాగే స్థానిక పాఠశాలలో అదనపు గదుల నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు సంబంధిత అధికారులు మహిళా సంఘాల సభ్యులకు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.