బెల్లంపల్లి పోలీసులా.. మజాకా..!
- మందేసీ చిందేసి ఊగారు
- పరువు తీసిన పోలీసులు
- సోషల్ మీడియాలో వైరల్
- ముక్కున వేలేసుకుంటున్న ప్రజలు
- ఇది పోలీసుల తీరు
- బెల్లంపల్లి శాఖకు కళంకం
బెల్లంపల్లి: పోలీసులంటే క్రమ శిక్షణకు మారు పేరు. ప్రాణాలకు తెగించి ప్రజలకి భద్రత కల్పిస్తారు. అలాంటి పోలీసులకి కాసింత సేద అవసరమే. ఎవరూ కాదనరు. మద్యం తాగి చిందులు వేయడం కాదు.. గౌరవంగా విందు పార్టీలు చేసుకోవచ్చు. కానీ పోలీసులు కదా.. కాస్తా మజానే ఉండాలని కోరుకుంటారు.. అదే కొంప ముంచింది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పోలీసుల(Bellampalli Police) ఘనకార్యం జిల్లాలో చర్చనీయాంశం అయ్యింది. వివరాలు ఇలా ఉన్నాయి.
బెల్లంపల్లి వన్ టౌన్ పోలీసులు కొందరూ ఈ నెల 15న తాండూర్ మండలం కత్తర్లల గ్రామంలోనీ రిసార్ట్ లో కొందరు పోలీసులలు పార్టీ చేసుకున్నారు. తాగినా మైకంలో నృత్యాలు చేశారు. ఈ దృశ్యాలు ఓ పోలీసు స్టేటస్ లో పెట్టుకున్నారు. ఇదే పోలీసుల చీకటి పార్టీ వ్యవహారాన్నీ బయట పెట్టింది. వీడియో లతో అడ్డంగా దొరికారు. 15 కు పై గా ఈ పార్టీలో పోలీసులు ఉన్నారనీ తెలుస్తోంది. ఇందులో పలువురు మహిళా పోలీసులు ఉండటం గమనార్హం. మగ పోలీసులతో జల్సా చేసుకోవడం ఒకింత ఆశ్చర్యం గొలిపింది.
మధ్యాహ్నం రిసార్ట్ కు చేరుకునీ సాయంత్రం వరకూ విందులో మునిగి పొయ్యారనీ సమాచారం. సివిల్ డ్రెస్సుల్లో ఉండి రహస్య విoధులు, వినోదాల్లో తెలియాడారు. పోలీసుల తీరుపై జోరుగా చర్చ జరుగుతోంది. రహస్యంగా పార్టీలు ఎందుకు చేసుకున్నారనేది అంతు పట్టడంలేదు. మందు పార్టీ అనంతరం మద్యం మత్తులో పోలీసులు అర్ధనగ్నంగా నృత్యాలు దుమారం లేపాయి..మహిళా కానిస్టేబుళ్లు, పురుష పోలీసులతో కలిసి నృత్యాలు చేయడం సంచలనంగా మారింది. అందరూ కలసి స్విమ్మింగ్లో జలకలాడారు. అంతేకాకుండా తడిసిన బట్టలతో నృత్యాలు చేయడంతో పోలీసుశాఖ పరువును బజారుకీడ్చినట్టుగా చర్చ జరుగుతుంది.
కేరింతలు కొడుతూ చిందులు వేశారు. సబ్ డివిజన్ కేంద్రమైన బెల్లంపల్లి ప్రధాన పోలీస్ స్టేషన్ కు చెందిన పోలీసుల వ్యవహారం పై ఉన్నతాధికారులు సీరియస్ గా ఉన్నట్టు సమాచారం. వెంటనే పోలీస్ అధికారులు రంగంలోకి దిగారు. ఘటనా స్థలానికి వెళ్లి తాండూరు సీఐ దేవయ్య విచారణ చేసినట్టు తెలిసింది. రిసార్ట్ లోనికి వెళ్లి పరిశీలించారు. ఏదేమైనా పోలీసులు ఇలా మందు తాగి చిందులు వేసిన సంఘటన పై వాడివేడి గా చర్చ సాగుతోంది. సోషల్ మీడియాలో, ప్రచారమాధ్యమాలలో పోలీసులు నృత్యాలు చేసినా దృశ్యాలను చూసి ప్రజలు తెగ నవ్వుకుంటున్నారు.. మందు పార్టీ లో చిందులు వేసిన పోలీసుల కు ఉన్నతాధికారుల చివాట్లు తప్పలేదు. చివాట్ల తోనే సరిపెట్టుకుంటారా? క్రమశిక్షణ చర్యలేమైనా తీసుకుంటారా? అనేది చూడాలి మరి..