వద్దన్న.. వరి సాగుకే మొగ్గు
17-11-2026 | 08:48pm
మల్యాల, నవంబర్ 17 (విజయక్రాంతి): మల్యాల మండలంలోని వివిధ గ్రామాల్లో వరి సాగు(Paddy Cultivation) పనులలో నిమగ్నమైనారు. ఒకవైపు కోతల మరోవైపు సాగు పనులు నడుస్తున్నాయి. వర్షాకాలంలో పండించిన వడ్లను రైతులు కొంతమంది పచ్చి వడ్లనే నేరుగా అమ్ముతున్నారు. ఎల్ ని నో ప్రభావంతో ప్రభుత్వం వరి సాగు చేయద్దు. మారుతడి ఆరుతడి పంటలే సాగు చేయాలని రైతులు పట్టించుకోవడం లేదు. ఆరుతడి పంటలు వేయడంపై రైతుల శ్రద్ధ చూపడం లేదు. మరో వారంలో రోజుల్లో వారి నాట్లకు భూమిని సిద్ధం చేస్తున్నారు. ప్రతి ఏడు కంటే ఈసారి ముందస్తుగా సిద్ధమయ్యారు.