టిఎస్సీపీఎస్ఈయు ఆధ్వర్యంలో ధర్మ దీక్ష
సామూహిక సాధారణ సెలవు పాటించి నిరసన తెలిపిన సి పి ఎస్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు
జగిత్యాల, నవంబర్ 17 ( విజయ క్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దాదాపు 2,80,000 మంది కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్(Contributory Pension Scheme) ఉద్యోగులు, ఉపాధ్యాయుల సామాజిక భద్రత, పదవీ విరమణ అనంతర జీవనోపాధిని పరిరక్షించాలని కోరుతూ, తెలంగాణ రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో నేడు మంగళవారం, నవంబర్ 17 జగిత్యాల జిల్లా కలెక్టరేట్ ఎదుట 'ధర్నా దీక్ష' కార్యక్రమం శాంతియుతంగ చేపట్టారు.
అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు సి పి ఎస్ ను రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని ( ఓ పి ఎస్ ) పునరుద్ధరించాలనే డిమాండ్‌తో నేడు 'మేనిఫెస్టో దినోత్సవాన్ని' పురస్కరించుకుని జిల్లాలోని సి పి ఎస్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు 'సామూహిక సాధారణ సెలవు ' పాటించి ఈ నిరసన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ కు తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ (TSCPSEU) జిల్లా నాయకులు గంగాధరి మహేష్, సర్వ సతీష్, గొల్లపల్లి మహేష్ గౌడ్ మాట్లాడుతూ "మా సంఘం రాష్ట్రవ్యాప్తంగా జూలై 11 నుండి ఆగస్టు 18, 2026 వరకు 33 జిల్లాలలో 'జన జాగరణ యాత్ర' నిర్వహించి, 80 మందికి పైగా ఎమ్మెల్యేలు, 7 మంది క్యాబినెట్ మంత్రులను కలిసి, కేవలం రూ. 1,500 నుండి రూ. 2,500 వరకు మాత్రమే నెలవారీ పెన్షన్ పొందుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రిటైర్డ్ సి పి ఎస్ ఉద్యోగుల దుస్థితిని వివరించింది." "ఆగస్టు 23న భారీ వర్షాలను సైతం లెక్కచేయకుండా వేలాది మందితో హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో జరిగిన
సి పి ఎస్ జన జాగరణ మహాసభ తీర్మానాలను సెప్టెంబర్ 17న రాష్ట్ర అధ్యక్షులు జి. స్థితప్రజ్ఞ, ప్రధాన కార్యదర్శి కె. శ్రీకాంత్ ల నేతృత్వంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు కు అందజేశామని " ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వంపై మాకు పూర్తి విశ్వాసం ఉంది. ఓ పి ఎస్ ను పునరుద్ధరించడం వల్ల రాష్ట్ర ఖజానాపై తక్షణమే భారం పడదని పైగా ప్రైవేట్ పెన్షన్ ఫండ్లకు ప్రభుత్వం ప్రతి నెలా చెల్లించే వాటా నిధులు ఆదా అవుతాయి" అని పేర్కొన్నారు.
రాష్ట్ర ఉపాధ్యక్షుడు మ్యాన పవన్ కుమార్ మాట్లాడుతూ
ఎన్నికల హామీ మేరకు సి పి ఎస్ ను వెంటనే రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని (OPS) పునరుద్ధరించేలా రాష్ట్ర ప్రభుత్వం సత్వర విధానపరమైన నిర్ణయం తీసుకోవాలి. ప్రభుత్వం ప్రతిపాదించిన అధికారిక అధ్యయన కమిటీలో, ఉద్యోగుల ఆరోగ్య పథకం కమిటీలో తెలంగాణ రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ ( TSCPSEU ) గుర్తింపు పొందిన ప్రతినిధులకు చోటు కల్పించాలని, డి ఏ బకాయిలు ఏక కాలంలో విడుదల చెయ్యాలని కోరారు. ఈ కార్యక్రమంలో
ఎస్ జీ టి యు రాష్ట్ర అధ్యక్షుడు కరివేద మహిపాల్ రెడ్డి, డి టి ఎఫ్ జిల్లా అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, సి పి ఎస్ రాష్ట్ర నాయకులు వీరభత్తిని శ్రీనివాస్, చుక్క కిరణ్ కుమార్, మిట్టపల్లి సాయిరెడ్డి, సందుపట్ల రమేష్ బండారి సతీష్, బండారి రాజు, చాట్ల వెంకటేష్, గాదె వెంకటేష్, హేమలత, సుజాత, రజిత తదితరులు పాల్గొన్నారు.